తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు మాటలు ప్రతిపాదనల్లోనే అభివృద్ధిని చూపించారని, తాము ఇచ్చిన హామీలనే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపించామన్నారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాల కల్పన కోసం ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు.