సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో మరిన్ని అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా దళారీ వ్యవస్థను కూకటివేళ్లతో తొలిగించామన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్ధం మరో పీఏసీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధానమైన రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రింగ్ రోడ్లను అభివృద్ధి చేసామన్నారు.