నేటి స్మార్ట్ యుగంలో ఫోన్లు, ల్యాప్ టాప్ ల వాడకం ఎక్కువైపోయింది. దీంతో కళ్లకు తగినంత విశ్రాంతి లేక, కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కంటి సమస్యలు రాకుండా చిన్న మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ, తగినంత నిద్ర పోవాలి. అలాగే సన్ గ్లాసెస్ ధరించి సూర్యకిరణాల నుండి కళ్లను కాపాడుకోవాలి. తరచుగా కళ్లను నలుపుకోవడం వలన కంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.