క్యాన్సర్ కు బలైన తండ్రి పెద్ద కర్మ కోసం ఓ బాలుడు భిక్షమెత్తిన ఘటన.. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా సొరసమితి బరంపురంలో జరిగింది. చంద్రకాంత్ జెనా తండ్రి రమేష్ జెనా హైదరాబాద్ లో పని చేసేవారు. అతనికి క్యాన్సర్ సోకడంతో గ్రామంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జీవన వికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మృతదేహాన్ని స్వగ్రామం చేర్చేందుకు సాయపడగా.. పెద్దకర్మ చేసేందుకు డబ్బులు లేక బాలుడు భిక్షమెత్తగా స్థానికులు సాయం చేశారు.