సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ కు చెందిన ఓ ఓటీటీ వేదిక కోసం త్వరలో ఒక షో చేయనున్నట్లు తెలిసింది. అయితే మంగళవారం సానియా బర్త్ డే సందర్భంగా షోయబ్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పాడు. దీంతో వారు విడాకులు తీసుకోవట్లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.