రైళ్లల్లో 23.8 శాతం మేర సకాలంలో గమ్యం చేరడం లేదని భారతీయ రైల్వే శాఖ తెలిపింది. స.హ చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చింది. 2016 నుంచి 2022 సెప్టెంబర్ వరకూ 76.20 శాతం సకాలంలో గమ్యస్థానాలకు చేరుకున్నాయని పేర్కొంది. మొత్తం 76,89,535 సర్వీసులు నడపగా.. 58,59,631 రైళ్లు సకాలంలో చేరాయని చెప్పింది. ప్రస్తుతం సగటున ప్రతి రోజూ 34.20 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలిపింది.