రష్యా ఆక్రమించిన కీలక నగరం ఖేర్సన్ సిటీని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడంపై అధ్యక్షుడు జెలెన్ స్కీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సైనికుల ధైర్య సాహసాల వల్లే ఇది సాధ్యమైందని.. యుద్ధం ముగింపునకు ఇది సూచన అని పేర్కొన్నారు. ఈ విజయంతో రష్యాకు తగిన గుణపాఠం చెప్పామని అన్నారు. సోమవారం జెలెన్ స్కీ అకస్మాత్తుగా ఖేర్సన్ సిటీలో పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa