వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆయన సృష్టించిన ‘కైలాస’ దేశంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విడుదల చేసిన ప్రకటన వైరల్ గా మారింది. భారత్ లోని కైలాస రాయబార కార్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ, హిందూ వర్శిటీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాడు. భారత్ లో ఏడాది పాటు శిక్షణ, శాలరీ ఉంటుందని చెప్పాడు. ట్రైనింగ్ లో అర్హత సాధిస్తేనే ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశాడు.