చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లెప్రసీ అనుమానాస్పద కేసును వైద్యాధికారులు డాక్టర్ నీలిమ, డాక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలిమ మాట్లాడుతూ కందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి ఇంటిలోనూ ఆశ , వాలంటీర్ , ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఒక్కరిని పరీక్షించి ఒకవేళ లెప్రసీ ఉన్నది అన్న అనుమానం ఉన్నట్లయితే ఆ కేసును ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు రెఫర్ చేసినట్లయితే మందులను ఉచితంగా పంపిణీ చేస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమం 20 రోజులపాటు ప్రతి గ్రామంలోనూ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది, ఎంపీ హెచ్ ఓ, సూపర్వైజర్, ఎం ఎల్ హెచ్ పి లు, సచివాలయం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.