ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు యావత్ ప్రపంచం సమిష్టిగా కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జీ-20 సదస్సులో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధం గత శతాబ్దంలో ప్రపంచంలోనే పెను విధ్వంసం సృష్టించిందని.. అప్పుడు శాంతి నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని.. ఇప్పుడు మన వంతు వచ్చిందని అన్నారు. శాంతి, సామరస్యం, భద్రతను పటిష్టం చేసేందుకు ఓ సంకల్పంతో ముందుకెళ్లడం ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు.