అనకాపల్లిలో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. జిల్లాలోని రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ కట్టెల కోసం జీడిమామిడి తోటలోకి వెళ్లింది. అక్కడ ఓ నలుగురు విద్యార్థులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొత్తకోట ఎస్సై విభీషణరావు చెప్పినదాని ప్రకారం. దొండపూడికి చెందిన ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి ఆ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆమె వయసు 38కాగా. ఈ నెల 6న దొండపూడికి సమీపంలో ఉన్న జీడిమామిడి తోటలోకి కట్టెల సేకరణ కోసం వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నలుగురు విద్యార్థులు బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఊరిలో పరువు తీస్తామని వారు బాధితురాలని బెదిరించారు.
కానీ బాధితురాలు మనోవేదనకి గురవుతుండటాన్ని గమనించిన భర్త విషయం అడగ్గా ఆమె బోరున ఏడుస్తూ భర్తకి ఏం జరిగిందో చెప్పింది. అలానే భర్తతో కలిసి ఆదివారం రాత్రి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసుని సీరియస్గా తీసుకున్న అనకాపల్లి దిశ డీఎస్పీ మహేశ్వరరావు, సీఐ టి. లక్ష్మి, ఎస్సై శేఖరం. విచారణని పర్యవేక్షించారు. ఈ క్రమంలో విద్యార్థులు దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయి. నిందితుల్లో ఇద్దరు మైనర్లుకాగా. అందులో ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. మరో ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పంపించారు.