కులం, మతం ఏవైనా భారత్ లో నివసిస్తున్న వారందరూ హిందువులేనని, 1925 నుండి ఆరెఎస్ఎస్ ఇదే చెబుతుందని మోహన్ భగవత్ అన్నారు. చత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందుత్వ సిద్ధాంతమని, 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.