ఏపీలోని కాకినాడ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలంలోని మల్లేపల్లి దగ్గర లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాడేపల్లి గూడెం నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa