పర్యాటకులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో అపూర్వ కట్టడాలు, స్మారక చిహ్నాలను ఉచితంగా సందర్శించేందుకు అనుమతిచ్చింది. ప్రపంచ వారసత్వ వారోత్సవాలు పురస్కరించుకొని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నవంబర్ 19 నుంచి 25 వరకూ పర్యాటకులకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఆ సమయంలో కట్టడాల సందర్శనకు ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని స్పష్టం చేసింది.