దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉ.9:43 గంటలకు సెన్సెక్స్ 74.59 పాయింట్ల నష్టంతో 61,798.40 వద్ద, నిఫ్టీ 28.25 పాయింట్లు నష్టపోయి 18,375.15 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.52 గా ఉంది. టైటాన్, సన్ ఫార్మా, విప్రో, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.