ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. ఒక్కరోజులోనే సుమారు 100 క్షిపణులను రష్యా బలగాలు ప్రయోగించాయి. ప్రధానంగా ఉక్రెయిన్ కు విద్యుత్ అందించే ఎనర్జీ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసి మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు చాలా చోట్ల దాడులు జరిపింది. ఈ దాడితో లక్షల మంది ఉక్రెయిన్ వాసులు అంధకారంలో మగ్గుతున్నారు.