మనదేశంలో తులసిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తుంటారు. అయితే అనేక వ్యాధులను నయం చేయడంలో కృష్ణ తులసి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కృష్ణ తులసి ఆకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. కృష్ణ తులసిని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు. కృష్ణ తులసితో కొవ్వు కరుగుతుందని, స్ట్రెస్ మాయం అవుతుందని నిపుణుల అంచనా. కృష్ణ తులసి దగ్గుకు మందులా కూడా పనిచేస్తుంది. దీనితో కీళ్ల నొప్పులు సైతం తగ్గుతాయి.