ఉప్పు ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. అలా అని తక్కువ తీసుకున్నా ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మొత్తంగా తీసుకోకుండా ఉంటే సోడియం లోపంతో ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. శరీరానికి తగినంత ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు.