ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విపరీతమైన చలికి వణికిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు అల్లూరి జిల్లాలోని కుంతలంలో 6.8, డుంబ్రిగూడలో 6.9, చింతపల్లిలో 7.9, అరకులోయలో 8.3, పాడేరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు కప్పుకుంది. వచ్చే 4 రోజులు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు పర్యాటకుల రాక జోరందుకుంది.