గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అభ్యర్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సూరత్ (తూర్పు) నుంచి బరిలో ఆప్ అభ్యర్థి కంచన్ జరివాలా మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదని పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయనపై ఒత్తిడి వచ్చిందని.. ఆయన్ను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక బీజేపీ ఉందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.