ప్రేయసిని గొంతుకోసి చంపి, ఆపై ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రియాకు పెళ్లై ఐదేళ్ల బాబు ఉన్నాడు. కానీ, కిరణ్ తో రెండేళ్లుగా అక్రమసంబంధం కొనసాగిస్తోంది. భర్తను వదిలేసి తనతో రమ్మని కిరణ్ ఒత్తిడి తెచ్చాడు. దీనికి రియా ఒప్పుకోకపోవడంతో గొంతుకోసి ఆమెను చంపేసి, దగ్గర్లోని రైల్వే స్టేషనుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.