గురజాల బాలిక అదృశ్యంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు ఎస్ఐ అనంతకృష్ణ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని గ్రామానికి చెందిన యువతీ 14వ తేదీన కుక్కకు అన్నం పెట్టి వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదని.. గత నెల రోజుల క్రితం ఎవరితోనో చాటింగ్ చేస్తూ కనిపించడంతో మందలించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. యువతీకి వివాహం కూడా నిశ్చయించినట్లు తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.