ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడుకు చెందిన గుంటుపల్లి చంద్రశేఖర్ (48)కు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. భార్యతో పదేళ్ల క్రితం మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 14న తన ఇంట్లో గడ్డి మందు తాగారు. సమాచారం అందుకున్న బంధువులు ఆయనను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.