అనంతపురం జిల్లా కూడేరులో 42వ జాతీయ రహదారిపై సిపిఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి, ఏపీని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దాదాపుగా గంటపాటు రాస్తారోకో చేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.