బుధవారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని పిల్లి వీధి, దువ్వారవీదులలో మూడు కోట్ల రూపాయల నిధులతో నాడు నేడుల్లో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి భూమి పూజ చేసి పనులను ప్రారంభోత్సవం చేశారు. మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు