అమ్మాయిలకు కుటుంబ సభ్యులు భరోసా ఇవ్వాలని.. వారిని పెంచే సామాజిక బాధ్యత వారిదేనని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ సూచించారు. ప్రియురాలు, జీవిత సహచరి అయిన శ్రద్ధావాకర్ ను ప్రియుడే దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా తల్లిదండ్రులు కుమార్తె పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని, ఇరుగు పొరుగు, ఆమె నివసించే ఫ్లాట్ యజమాని సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.