సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చొని ప్రశాంతగా సిగరెట్ తాగుతారు. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ సిగరెట్ తాగుతూ 42 కి.మీ పరిగెత్తి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మొత్తం మారథాన్ ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. మొత్తం 1500 మంది ఈ రేసులో పాల్గొనగా చెన్ మాత్రమే మారథాన్ లో స్మోక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 19లోనూ జరిగిన మారథాన్ లో చెన్ ఇలానే సిగరెట్ తాగుతూ పరిగెత్తాడు.