కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని వార్తలు చక్కర్లుకొట్టాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇస్తూ తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని, తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత పనుల మీదే తాను ఢిల్లీకి వచ్చానని, తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని తెలిపారు.