ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 12:39 PM

వైసీపీ ప్రభుత్వ మూడున్నర ఏళ్ల పాలనలో అన్నిరకాల సేవలు, వస్తువులధరలు, పన్నుల పెంపుతో ఒక్క కుటుంబం నుంచి ఏడాదికి సుమారు రూ.లక్షలను బాదుతూ దోచుకుంటుందని పల్నాడు  జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 16, 18వ వార్డుల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా జీవి మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి సంక్షేమ పథకాల మాటున దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారం అడ్డం పెట్టుకొని వినుకొండలో పొలిటికల్‌ రియల్‌ఎస్టేట్‌ చేస్తూ అక్రమంగా రూ.వందల కోట్లు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com