పులివెందుల తహసీల్దారు కార్యాలయంలో బుధవారం పట్టణ వీఆర్వో క్రిష్ణమోహన్రావుపై రాగిపాటి పెద్ద మస్తాన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని నేక్బిల్డింగ్ సమీపంలో గల భూమికి సంబంధించి రాగిపాటి మస్తాన్ బుధవారం తహసీ ల్దారు కార్యాలయానికి వెళ్లి తన భూమికి సంబంధించి ఆన్‌లైన్‌కు ఎక్కించాలని వీఆర్వోను అడిగారు. ఈ భూమి వ్యవహారం కోర్టులో ఉందని వీఆర్వో చెప్పడంతో మస్తాన్ దాడి చేసి తన దగ్గర ఉన్న కత్తితో వెనక వైపు పొడిచాడు. అక్కడే ఉన్న సహోద్యోగులు వెంటనే కత్తితో దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. గాయపడిన వీఆర్వోను చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.