పొగాకు బేరల్ లైసెన్స్ పునరుద్ధరణకు ఈనెల 29వ తేది వరకు సమయం పొడిగించినట్లు ప్రాంతీయ పొగాకు బోర్డ్ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణ శ్రీ తెలిపారు. గురువారం ఒంగోలు పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతులకు లోబడి మాత్రమే పొగాకు పంటని సాగు చేసేలా రైతులకు అవగాహన కలిపించాల్సిన బాధ్యత ఆయా పొగాకు బోర్డ్ నిర్వహణ అధికారులదే అని ఆయన స్పష్టం చేశారు. రైతులందరికీ ద్రావణంతో పిచికారి చేసే మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కష్ట శ్రీ ఆదేశించారు.