పాలు తాగే ముందు తాగిన తర్వాత ఈ పదార్థాలను అస్సలు తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాలు తాగిన తర్వాత నిమ్మకాయ, ముల్లంగి తినకూడదని చెబుతున్నారు. ఇలా తీసుకుంటే అజీర్తి, చర్మ సమస్యలు వస్తాయని తెలిపారు. అలాగే పాలతో పాటు చేపలు, సిట్రిక్ ఫ్రూట్స్, పులుపు ఉన్న పదార్థాలు తినడం వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.