బంగారం ధరలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వన్ ఇండియా, వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో బ్యాంకు ధరల ఆధారంగా ఒకే రకమైన గోల్డ్ రేట్స్ అందుబాటులోకి రానున్నాయి. 916 స్వచ్ఛత 22 క్యారెట్ల బంగారానికి కూడా ఇది వర్తించనుంది. భారత్ లో ఈ విధానాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.