ఫుడ్ డెలివరీలోనూ మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన దీపికా అనే ఇంజినీర్ ఫేస్ బుక్ లో ప్రకటన చూసి చపాతీ, చికెన్ ఆర్డర్ ఇచ్చేందుకు ఫోన్ చేసింది. మాట్లాడిన వ్యక్తి ఖాందాని రాజధాని రెస్టారెంట్ అని పరిచయం చేసుకుని ఓ లింక్ పంపి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నాడు. దీంతో ఆమె అలానే చేసి క్రెడిట్ కార్డుతో ఆర్డర్ పెట్టగా రూ.61 వేలు కట్ అయ్యాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.