ముంబైలో ఇన్ ఫెక్షన్ డీసీజ్ మీజిల్స్ రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధి లక్షణాలున్న వారి సంఖ్య మొత్తం 1,071కి చేరింది. అందులో ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో 68 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఏఢుగురు పిల్లలు మృతి చెందగా ఐదుగురు మీజిల్స్ అనుమానిత మృతులున్నారు. ముంబైలోని 8 బీఎంసీ వార్డుల్లోని మురికి వాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న పిల్లలను అధికంగా గుర్తించారు. ఈ క్రమంలో తూర్పు, పశ్చిమ గోవండీ, బైకళ, కుర్లా, వడాల, ధారావి రీజియన్లను హైరిస్క్ ప్రాంతాలుగా కేంద్ర కమిటీ ప్రకటించింది.