కువైట్ లో వివిద కేసుల్లో దోషులుగా తేలిన ఏడుగురు ఖైదీలకు అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేసింది. వారిలో ముగ్గురు కువైట్ కు చెందిన పురుషులు ఉండగా, ఓ మహిళ ఉన్నారు. వీరితో పాటు సిరియా, పాక్ కు చెందిన ఇద్దరు పురుషులు, ఇథియోపియాకు చెందిన మరో మహిళ ఉన్నారు. ఏ పద్ధతిలో వీరికి శిక్ష అమలు చేశారనే దానిపై కువైట్ స్పష్టత ఇవ్వలేదు. ఈ చర్యలను ఈయూ ఖండించింది.