ప్రస్తుతం పురాతన వస్తువుల కొనుగోలు ట్రెండ్ సాగుతోంది. ఈ క్రమంలోనే 140 ఏళ్ల నాటి బీరు బాటిల్ రూ.4.05 కోట్ల ధర పలికింది. మద్యం విక్రయాల్లో వైన్, షాంపైన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అవి మాత్రమే అత్యంత ఖరీదైన రకాలని... మద్యం తాగే వారిలో... తాగని వారిలో కూడా ఒక సాధారణ నమ్మకం. కానీ ఇది నిజం కాదు. ఖరీదైన బీర్లు కూడా ఉన్నాయి. ఓ బీర్ బాటిల్ ఏకంగా కోట్లు పలికింది. నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం. "ఆల్‌సోప్స్ ఆర్కిటిక్ ఆలే" అని పిలువబడే 140 ఏళ్ల నాటి బీరు బాటిల్ రూ.4.05 కోట్ల ధరకు సేల్ అయింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆలేగా మారింది.
ఇంత పెట్టి కొనడానికి ఆ బీర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. బీర్ బాటిల్ చరిత్రాత్మకమైనది. 2007లో ఓక్లహోమా అనే వ్యక్తి రూ.23 వేలకు ఈ బాటిల్‌ను దక్కించుకున్నాడు. దాంతో పాటు ఈ బాటిల్ తనకు 1919లో వచ్చిందని తెలుపుతూ పెర్సీ జి.బోల్‌స్టర్ సంతకం చేసి ఇచ్చిన ఓ నోట్ కూడా ఓక్లహోమాకు ఇచ్చారు. 1852లో ఓ యాత్ర కోసం ప్రత్యేకంగా ఈ బీర్‌ను తయారు చేశారని ఆ నోట్‌లో పేర్కొన్నారు.
ఆ నోట్‌తోనే కొనుగోలు దారుడు దాని ప్రత్యేకతను తెలుసుకున్నాడు. సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని సిబ్బంది కోసం వెతుకుతున్న సమయంలో సర్ ఎడ్వర్డ్ బెల్చెర్ 1852లో ఆర్కిటిక్‌కు తీసుకెళ్లిన కాష్‌లో ఈ బీర్ భాగమని ఓక్లాహోమ్ వెంటనే గ్రహించాడు. అందుకే ఆ బీర్‌ను ఆర్కిటిక్ వాతావరణానికి అనుగుణంగా తయారు చేశారు. అందులో ఉన్న అధిక ఆల్కహాల్ కంటెంట్ బీర్‌ను గడ్డకట్టకుండా చేస్తుంది. ఇంత ప్రత్యేకత ఉన్న బీర్ బాటిల్‌ను విక్రయంలో పెట్టగా.. బాటిల్ కోసం 157కుపైగా బిడ్లు దాఖలయ్యాయి. చివరికి రూ. 4.05 కోట్లకు అమ్ముడిపోయింది. అయితే ఇంత ప్రత్యేకం గల ఈ బాటిల్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి పగలగొట్టాడా..? అలాగే ఉంచాడా..? అనేది తెలియలేదు.