మన సమాజంలో ప్రస్తుతం ప్రేమకు అవదులు...పరిమితులను కొందరు ప్రేమికులు చేరిపేస్తున్నారు. ప్రేమ గుడ్డిది అంటుంటారు... ఎందుకంటే ఒక్కసారి ప్రేమలో పడిన వారు రంగు, కులం, దేశం, ప్రాంతీయ బేదాలను సైతం పట్టించుకోరు. తాము వలిచిన వారితో జీవించేందుకు ఇంట్లో వాళ్లనైనా, సమాజాన్నైనా ఎదురిస్తారు. ఎన్ని హద్దులున్నా దాటుకుని వచ్చి.. ఒక్కటవుతారు. ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో 19 ఏళ్ల అమ్మాయి.. 70 ఏళ్ల వ్యక్తిని వలిచింది. వయస్సులో ఇంత తేడా ఉన్నా.. ఆయనతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని... ఆయనతోనే జీవిస్తుంది.
షుమైలా (19), లియాఖత్ అలీ (70)లు లాహోర్‌లోని మార్నింగ్ వాక్‌లో కలుసుకున్నారు. వయస్సులో చాలా తేడా ఉన్నా సరే వారిద్దరు ప్రేమలో పడ్డారు. అనతి కాలంలో వారి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు లియాఖత్... షుమైలా వెనుక జాగింగ్ చేస్తూ ఓ పాటను హమ్ చేశాడు. దాంతో వీరి ప్రేమ వ్యవహారం మొదలైంది. అయితే వయస్సులో ఇంత తేడా ఉన్నా ఎలా ప్రేమలో పడ్డారని వారిని అడిగిన ప్రశ్నకు.. ప్రేమ వయస్సును చూడదని, అది అలా జరిగిపోతుందని షుమైలా చెప్పింది.
అయితే వీరిద్దరి పెళ్లికి షుమైలా తల్లిదండ్రులు అంగీకరించ లేదంట. తర్వాత వారిని ఒప్పించానని తెలిపింది. "నా తల్లిదండ్రులు కొంతకాలం అభ్యంతరం వ్యక్తం చేశారు, కాని మేము వారిని ఒప్పించగలిగాం." అని షుమైలా చెప్పుకొచ్చింది. అంతేకాదు "ఎక్కువ వయస్సు తేడాతో వివాహం చేసుకునే వారిపై ప్రజలు ఎటువంటి కామెంట్ చేయకూడదు. వారి నిర్ణయానికి వారిని గౌరవించాలి. ఇది వారి జీవితం, వారు కోరుకున్న విధంగా జీవిస్తారు". అని అనుకోవాలని షుమైలా అన్నారు.
ఇదే సందర్భంలో పెళ్లిలో రోమాన్స్ పెద్ద విషయం కాదని 70 ఏళ్ల లియాఖత్ అన్నారు. తన భార్య వంటతో చాలా సంతోషంగా ఉన్నానని, రెస్టారెంట్లలో తినడం వదిలేశానని చెప్పుకొచ్చాడు. అలాగే చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అనుమతి ఉన్న ఎవరైనా వివాహం చేసుకోవచ్చని, వయస్సు తేడాతో పని లేదని లియాకత్ చెప్పాడు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనప్పుడు.. వయస్సు బేధం చూడకూడదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. వీరి ప్రేమకథ, పెళ్లి కథను తెలుసుకుని.. సయ్యద్ బాసిత్ అలీ వీరిని ఇంటర్వ్యూ చేశాడు. వీరి ఇంటర్వ్యూను తన యూట్యూబ్ ఛానెల్లో పెట్టగా మూడు లక్షల మందికిపైగా చూశారు.
గత కొన్ని రోజుల క్రితం ముస్కాన్ అనే (18) అమ్మాయి... ఫరూఖ్ అహ్మద్ (55)ని వివాహం చేసుకుంది. ఇద్దరిని ఒక పాట దగ్గర చేసింది. మ్యూజిక్ అంటే ఇద్దరికి చాలా ఇష్టం. ఆ అభిరుచే.. ఇద్దరిని ఒక్కటి చేసింది. అలాగే ఇటీవల ఓ పోలాండ్ 83 ఏళ్ల మహిళను.. ఓ 28 ఏళ్ల పాకిస్థాన్ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఆయన కోసం ఆమె దేశం విడిచి రాగా.. ఈయన ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నాడు.