కొన్ని ఇళ్లు దాని ప్రత్యేకతలను బట్టి వాటి విలువ నిర్ధారణ చేస్తుంటారు. అలాంటి ఇళ్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. ఇళ్లను ఎవరైనా తమకు నచ్చినట్టుగా నిర్మించుకుంటారు. తమ అభిరుచులకు తగ్గట్టుగా, అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసుకుంటారు. అలా నిర్మించుకున్న త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఓ మహిళ.. సేల్‌కు పెట్టారు. దాని ధర రూ.1.68 కోట్లు నిర్ణయించారు. అయితే ఆ ఇల్లు అన్ని ఇళ్లలా లేదు. కావాలనుకుని కట్టుకున్నారో.. లేదా.. పొరపాటుగా జరిగిందో కానీ.. ఆ ఇంట్లో ఓ పడక గది మధ్యలో బాత్రూమ్‌ను నిర్మించారు.
ఇంత వెరైటీ ఇంటిని... రైట్‌మోవ్ అనే వెబ్‌సైట్‌లో యూకేలోని బర్మింగ్‌హామ్‌లో అమ్మకానికి పెట్టారు. దీని ధర రూ. 1.68 కోట్లు. ఈ ఇంటిని గోర్డాన్ జోన్స్ ఎస్టేట్ ఏజెంట్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇల్లు చాలా వరకు విశాలమైన లాంజ్‌తో ఉంటుంది. బే కిటికీలు, భారీ మాస్టర్ బెడ్‌రూమ్, బీమ్-సీలింగ్ కిచెన్, ఆధునిక సౌకర్యాలతో ఉన్న బాత్రూమ్‌లతో చాలా నీట్‌గా, పద్ధతిగా నిర్మించారు. చూడగానే ఎవరైనా ఇష్టపడతారు. కానీ ఈ ఇంటిని చూసిన వాళ్లు చాలా ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే ఇంట్లో ఒక బెడ్ రూమ్ కొద్దిగా భిన్నంగా ఉంది. చెప్పాలంటే అది ఆ ఇంటికే ప్రత్యేకంగా నిలిచింది. పడకగదుల్లో బాత్రూమ్‌ను ఎవరైనా పక్కకు కట్టుకుంటారు. కానీ ఈ ఇంట్లో ఒక బెడ్ రూమ్‌లో బాత్రూమ్ కరెక్టుగా మధ్యలో ఉంది. రూమ్ మధ్యలో షవర్ క్యూబికల్‌ను ఏర్పాటు చేశారు. బాక్స్ షవర్ కరెక్టుగా గది మధ్యలో ఉంది. అది క్యూబికల్ విత్ ఎలక్ట్రిక్ షవర్. ఇంట్లో ఆ బాత్రూమ్‌ను చూసి గ్లోవర్ అనే వ్యక్తి మొదట షాక్ అయ్యాడు. బెడ్‌రూమ్ మధ్యలో స్నానం చేసే అవకాశం ఉన్నప్పుడు.. ఇంక ప్రత్యేకంగా బాత్రూమ్‌ను ఎందుకు నిర్మించుకోవాలని అడిగాడు. అయితే ఇలా ఎందుకు నిర్మించారనే ప్రశ్నకు మాత్రం.. అసలైన సమాధానం దొరకలేదు.