మనం చేపల బరువు ఈ మేర అని వింటుంటాం. కానీ ఒడిశా జాల్లర్లకు ఆరుదైన చేప చిక్కింది. సముద్రాల్లో వేటకు వెళ్లే జాలర్లకు.. అప్పుడప్పుడు అరుదైన చేపలు, జీవులు పడుతుంటాయి. ఒక్కోసారి విలువైన వస్తువులు కూడా చిక్కుతుంటాయి. మొసళ్లు, నీటి సర్పాలు, ఇతర వింత జీవులు చేపల వలలకు చిక్కిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని జాలర్లకు ఓ భారీ చేప దొరికింది. బాలాసోర్ తీరంలో వేటకు వెళ్లిన జాలర్లకు అతి పెద్ద చేప చిక్కింది. అది కూడా అత్యంత అరుదైన చేప.
పైగా అది మాంసాహార జీవ జాతికి చెందిన చేప అని మత్స్యకారులు తెలిపారు. చాలా అరుదుగా కనిపించే చేప మత్స్యకారులకు దొరికింది. దీనిని ఈ చేపకు అనేక పేర్లు ఉన్నాయి. సెయిల్ మార్లిన్, మార్లిన్ ఫిష్ అని, మార్లిన్ ఏకేఏ అని అంటుంటారు. ప్రస్తుతం జాలర్లకు చిక్కున ఈ చేప బరువు వంద కాదు.. రెండు వందలు కాదు.. ఏకంగా 550 కిలోలు. ఇంత బరువైన చేపను .. చూసిన స్థానికులు తెగ ఆశ్చర్యపోతున్నారు.
దీనిని మత్స్యకారులు అక్షరాల లక్ష రూపాయలకు విక్రయించారు. ఏకంగా రూ.1,00,000లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ చేపలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయంట. ముఖ్యంగా ఒత్తిడిని నియంత్రించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయంట. అందుకే ఈ అరుదైన చేపను ఒత్తిడి నివారణ మందుల తయారీకి వినియోగిస్తారని అసిస్టెంట్ ఫిషరీస్ ఆఫీసర్ పార్థసారధి స్వెయిన్ వెల్లడించారు. కాగా అప్పుడప్పుడు దొరుకుతున్న ఇలాంటి చేపల వల్ల మత్స్యకారులకు కాసులు పంట పడుతుంది. లక్షల్లో అమ్ముడవడంతో.. వారి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. కానీ ఇలాంటి అదృష్టాలు అప్పుడప్పుడు మాత్రమే తలుపు తడుతున్నాయి.