ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైగర్ కు అంత పెట్టుబడి ఎవరు పెట్టారు....ఆరా తీస్తున్న ఈడీ

national |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 12:24 AM

లైగర్ సినిమాకు అంత బారీ పెట్టుబడి ఎవరెవరూ పెట్టారో తెలుసుకొనే క్రమంలో ఈడీ అధికార్లు తాజాగా దర్వకుడు పూరి జగన్నాథ్, నటి ఛార్మిని విచారించారు.. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి కలిసి తీసిన లైగర్ సినిమా విడుదలకు ముందు ఎంత రచ్చ చేసిందో.. రిలీజ్ అయిన తర్వతా అంతే సైలెంట్‌గా వెళ్లిపోయింది. అయితే.. ఈ సినిమా మళ్లీ ఇప్పుడు వార్తల్లో రచ్చ చేస్తోంది. అయితే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్ సినిమా నిర్మాణంలో పెట్టుబడుల వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఇటీవల విడుదలైన ఈ లైగర్ సినిమా కాసులు కురిపించటంలో నిరాశపర్చిన లైగర్.. దర్శక నిర్మాతలకు మాత్రం పెద్దఎత్తున చిక్కులు తెచ్చిపెడుతోంది. అయితే.. ఈ సినిమా నిర్మాణంలో పలువురు రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పూరీ జగన్నాథ్ ఖాతాలోకి పెద్దఎత్తున విదేశీ నగదు జమ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించి 15 రోజుల క్రితమే పూరి జగన్నాథ్‌తో పాటు.. సినిమా నిర్మాత చార్మీకి కూడా నోటీసులు పంపించారు. ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఇవాళ ఉదయమే పూరీ జగన్నాథ్, చార్మి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. మీడియా కంట పడకుండా పూరి జగన్నాథ్, ఛార్మీ.. వెనకవైపు నుంటి ఆఫీసులోకి వెళ్లారు. ఈమేరకు ఈడీ అధికారులు.. సినిమాలో విదేశీ పెట్టుబడులపై పూరి జగన్నాథ్‌ను 13 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. హవాలా, మనీలాండరింగ్ రూపంలో పెట్టుబడులు పెట్టినట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సినిమాలో విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులపై కూడా ఆరా తీశారు.


టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. తాను తీసే సినిమాలతో పూరీ ఎంత ఫేమసో.. ఆయన చెప్పే ఫిలాసఫీతో కూడా ఆయన అభిమానులను సంపాధించుకున్నారు. అయితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోయిన పూరీ.. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అటు సినిమాలు ప్లాప్ కావటమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు కూడా ఆయనను చాలా డిస్ట్రబ్ చేసింది. అయితే.. అందులో నుంచి తేరుకున్న పూరీ.. చార్మీతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు పూరీ. ఆ తర్వాత.. పాన్ ఇండియా మూవీతో ఇండస్ట్రీకి గట్టి హిట్ ఇవ్వాలనుకున్న పూరీ.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ తీశారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా.. థియేటర్లలో కాసులు కురిపించటంలో మాత్రం ఈ పాన్ ఇండియా మూవీ నిరాశపర్చింది.


అయితే.. ఇప్పుడు చర్చ అంతా ఇంత భారీ సినిమా తీసేందుకు పెట్టుబడులు ఎవరు పెట్టారనే. ఈ సినిమాకు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ కూడా ఓ చేయి వేయగా.. మిగత పెట్టుబడులు రాజకీయ నాయకులు పెట్టారనేది ఆరోపణ. ఆ మధ్య.. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కూడా పూరీకి బెదిరింపు కాల్స్ రావటం.. దానికి పూరీ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇవ్వటం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ.. పెట్టుబడుల విషయమై ఈడీ అధికారులు పూరీని విచారించటంతో.. లైగర్ మూవీ ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com