తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి పంజా విసురుతోంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపితుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే గుండెపోటు వచ్చి చికిత్స పొందుతున్నవారు, డయాబెటిస్, బీపీ బాధితులు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నారు, స్థూలకాయులు, శారీరక వ్యాయామానికి దూరంగా ఉండేవారు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.