పంజాబ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లూథియానాలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఓ గోడౌన్లో మద్యం బాటిళ్లతో కూడిన 600 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని, ఎక్సైజ్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని పోలీసు అధికారులు తెలిపారు