ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. 2018లో రెండేళ్ల గడువుతో పదవిని స్వీకరించిన మిశ్రా పదవీకాలాన్ని కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా, 2023 నవంబర్ 18 వరకు ఈడీ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.