భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నేడు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ రాకెట్ ను రూపొందించింది. విక్రమ్-ఎస్ రాకెట్ పొడవు 6 మీటర్లు, పేలోడ్ సామర్థ్యం 83 కిలోలు, ద్రవ్యరాశి 545 కిలోలుగా ఉంది.