సంక్రాంతి నాటికి ఏపీలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇప్పటికే 66 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేశామని, త్వరలో మరో 110 స్కిల్ హబ్స్ ప్రారంభిస్తామన్నారు. వీటి ద్వారా ఏటా 10,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన 222 కోర్సులను ఎంపిక చేశామని, ప్రతి స్కిల్ హబ్ లో కనీసం 2 కోర్సుల్లో శిక్షణనిస్తామన్నారు.