ఇటీవల పశువులను రైళ్లు ఢీకొంటున్న ఘటనలు ఎక్కువవడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాలపైకి పశువులు రాకుండా అడ్డు గోడలు కట్టాలని నిర్ణయించింది. రాబోయే ఐదారు నెలల్లో వెయ్యి కి.మీ మేర గోడలు కట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ఓ డిజైన్ ఖరారు చేశామని.. అన్ని సెక్షన్లలో నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.