బీహార్ ఖగడియా జిల్లా అలౌలీ పీహెచ్సీలో వైద్య సిబ్బంది విది నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. 23 మంది మహిళలకు మత్తు ఇవ్వకుండానే కు.ని చికిత్స చేశారు. దీంతో నొప్పి భరించలేక మహిళలు కేకలు వేయగా.. మరో ఏడుగురు మహిళలు అరుపులు విని పారిపోయి స్థానికులకు విషయం చెప్పారు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ సివిల్ సర్జన్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.