అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళ్ళపాక లో అనధికార అక్రమ మరం తరలింపు విస్తృతంగా సాగుతోందని టీడీపీ నాయకులు అద్దెపల్లి ప్రతాప్ రాజు ఆరోపించారు. దీనిపై గురువారం స్థానిక తహసిల్దార్, ఆర్ ఐ సుశీల్ కుమార్ దృష్టికి తెచ్చినా సాకులు చెప్పి పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మదన గోపాల పురం చక్రధర్ కాలనీ వద్ద నుంచి ట్రాక్టర్ లల్లో మన్నూరు సిటీ కల్యాణమండపం సమీపంలో రియల్ ఎస్టేట్ వారికి మరం తరలిస్తున్నట్టు ఆరోపించారు. కొందరికి అనధికార అనుమతులు ఇచ్చి మరి కొందరికి ఇవ్వక పోవడం తగదని అన్నారు.