ఏపీ ప్రభుత్వం చర్చిల నిర్మాణం, మరమత్తులు, ఇతర పనుల కోసం రూ.175 కోట్లను మంజూరుచేసింది. 175 నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున అందించనుంది. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 19వ తేదీలోగా ప్రతిపాదనలను అందించాలని కలెక్టర్లు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు.